ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి

by Elthuri vijay kumar |

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి
X

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

రాంనగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత మెడికల్ క్యాంపు

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను, పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు. ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణను సుభ్రం చేసి మొక్కలు నాటాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యసబ్ సుల్తానా, డి.పి.ఎం జి.ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.

హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలన..

వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హైపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు, సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రిలోనే పలు విభాగాలు సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్.ఎం.ఓ నవీనా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజిత పాల్గొన్నారు.

Next Story