- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027 కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంగళవారం నిర్వహించారు.

దిశ, వెల్గటూర్ : గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027 కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలి వస్తారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేం దుకు దేశం నలు మూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు,భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్య వంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత,వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచిం చారు. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తుచేశారు. అలాగే గోదావరి పుష్కరాలను కూడా మరింత వైభవంగా నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ వ్యాప్తంగా నిలబెట్టాలని మంత్రి తెలిపారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.






