- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో ఎన్నికల నిధుల గోల్ మాల్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నిధుల పంపిణీ పై తీవ్ర వివాదం చెలరేగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సుమారు రూ.3 కోట్ల నిధులు పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేయాలని పై స్థాయి నుంచి పంపినట్లు సమాచారం.

దిశ, గోదావరిఖని: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నిధుల పంపిణీ పై తీవ్ర వివాదం చెలరేగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సుమారు రూ.3 కోట్ల నిధులు పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేయాలని పై స్థాయి నుంచి పంపినట్లు సమాచారం. అయితే ఆ నిధుల వినియోగం, పంపిణీ విధానం, లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పెద్దపెల్లి జిల్లాలో రామగుండం నియోజకవర్గ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులను పిలిపించుకొని రాష్ట్రస్థాయి నాయకులు ఎంక్వయిరీ చేస్తున్నారు. అంతర్గత విచారణ ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల మధ్య అసంతృప్తి
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొంతమంది అభ్యర్థులకు తక్కువ మొత్తాలు మాత్రమే అందగా, మరికొందరికి అధికంగా నిధులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అభ్యర్థుల మధ్య అసంతృప్తి పెరిగింది. ఎక్కువ ఇచ్చామని చెప్పండి” అని పేర్కొంటున్నారు. కొంతమంది నాయకులు అభ్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చి, వాస్తవంగా అందని నిధులను కూడా అందినట్లు చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర చెప్పిచ్చుకుంటున్నట్లు సమాచారం. ఒత్తిడి వస్తున్నట్లు చూపించాలని కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం పార్టీ లోపలే తీవ్ర చర్చకు దారి తీసింది.
నిధుల గల్లంతు ఆరోపణలు
పార్టీ ఫండ్‌లోని కొంత మొత్తం మధ్యలోనే మాయం అయిందని, ఎవరు ఎంత తీసుకున్నారు? ఎవరికెంత ఇచ్చారు? అనే అంశాలపై స్పష్టత లేకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది.ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా నాయకులను వివరణ కోసం ఆదివారం పెద్దపెల్లి జిల్లాలో ప్రత్యక్షంగా నాయకులను పిలిపించుకొని విచారణ చేస్తున్నారు. అక్రమాలు నిరూపితమైతే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు.
పార్టీ ఫండ్ దుర్వినియోగం అయిందని ఆరోపణలు
నాయకులు పార్టీ పండు అభ్యర్థులకు ఇవ్వకుండా వాడుకున్నారని ఆరోపణలు ఒకరిపై ఒకరు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకున్నారు. కొంతమంది నాయకులు పార్టీ పండుగ తమ జేబులో వేసుకున్నారని ఆరోపణలు పెద్ద మొత్తంలో వినబడుతున్నాయి.
పార్టీ శ్రేణుల్లో గుబులు..
ఈ మొత్తం పరిణామంతో బీజేపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందు ఇలాంటి వివాదాలు బయటకు రావడం పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దిశ కథనం పై చర్చ
“ఎన్నికల నిధులు గోల్మాల్” అనే శీర్షికతో దిశ దినపత్రికలో కూడా ఈ అంశం ప్రచురితమవడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారి తీసింది. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నిధుల వ్యవహారం బీజేపీకి కొత్త తలనొప్పిగా మారింది. విచారణ ఫలితాలు ఎలా ఉంటాయో, ఎవరిపై చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






