- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ భూమిలోకి దారి ఇప్పించండి
తమ వ్యవసాయ భూమిలోకి వెళ్లే దారిని ఓ రైతు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సుమారు నలభై మంది బాధిత రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

దిశ, గొల్లపల్లి : తమ వ్యవసాయ భూమిలోకి వెళ్లే దారిని ఓ రైతు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సుమారు నలభై మంది బాధిత రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. బాధిత రైతులు మాట్లాడుతూ బీబీరాజ్ పల్లి గ్రామంలోని డి 64/ఎ కాలువ పక్కన గత 20 సంవత్సరాల నుండి ఉన్న దారిని ఓ రైతు మూసివేయడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు వెంటనే కలగజేసుకుని సమస్య పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో తహసీల్దార్ పూర్తి వివరాలు తెలుసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా తన పట్టా భూమి నుండి అక్రమంగా దారి నిర్మించుకునేందుకు కొంతమంది రైతులు ప్రయత్నిస్తున్నారని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నరేష్ అనే రైతు కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టడంతో ఈ వివాదం మొదలైనట్టుగా తెలుస్తుంది.
- Tags
- worry






