- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీశ్ రావు ముందు సిట్ నోటీసులకు రిప్లై ఇవ్వు
సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న హరీశ్ రావు ఆరోపణలను మంత్రి లక్ష్మణ్ కుమార్ పూర్తిగా ఖండించారు. మంగళవారం మీడియా తో మాట్లాడిన మంత్రి ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి రెండేళ్లు అవుతుందని కక్ష్య సాధించాలంటే ఇంతకాలం ఆగాల్సిన అవసరం ఏముంది? అధికారంలోకి వచ్చిన వెంటనే చేసేవాళ్లమని అన్నారు. పదేళ్లు మేమే రాజు.. మేమే మంత్రి అన్న రీతిలో రాచరిక పాలన సాగిందని విమర్శించారు. కమిషన్ల మీద కక్కుర్తి పడి రాష్ట్రాన్ని దోచుకుని లూటీ చేశారని ఆ అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. నిజాలు బయటకు వస్తుంటే ఏమి చెప్పలేక మా ప్రభుత్వం పై మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్ రావు నిజంగా నీతిమంతుడైతే ముందు సిట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేశారని స్వయంగా మాజీ ఎంపీ కవితక్క హరీష్ రావు పేరు మెన్షన్ చేస్తే ఎందుకు జవాబు చెప్పలేదని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఈరోజు అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని ఇందులో ఎక్కడా కక్ష్య సాధింపు లేదన్నారు. హరీశ్ రావు విషయంలో మాత్రమే కాదు.. గత ప్రభుత్వంలో తప్పులు చేసి అక్రమాలకు పాల్పడిన వారందరి విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేసారు. ఇక క్యాబినెట్ మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఓ మీడియా అధినేత మాట్లాడిన దానికే డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారని వివరణ ఇచ్చారు.






