తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామానికి చెందిన

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ : తాటి చెట్టు పై నుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామానికి చెందిన బండి రాజయ్య శుక్రవారం సాయంత్రం తన వృత్తి లో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న సమయంలో కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు సహాయంతో హుటాహుటిన 108 వాహనంలో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని జిల్లా గీత కార్మి సంఘం ప్రభుత్వాన్ని కోరారు.

Next Story