- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికల హవా
జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాలు ఈసారి ఆశాజనకంగా నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు రాష్ట్ర ర్యాంకింగ్స్‌లో కూడా జిల్లా ముందడుగు వేసింది.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాలు ఈసారి ఆశాజనకంగా నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు రాష్ట్ర ర్యాంకింగ్స్‌లో కూడా జిల్లా ముందడుగు వేసింది. ఫస్ట్ ఇయర్ జనరల్‌లో మొత్తం 6,645 మంది పరీక్షలకు హాజరై, అందులో 4,174 మంది ఉత్తీర్ణులయ్యారు. 62.81 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 13వ స్థానాన్ని సాధించింది. గతంలో ఉన్న 24వ స్థానం నుంచి వచ్చిన పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. సెకండ్ ఇయర్ జనరల్ ఫలితాలు మరింత మెరుగ్గా నమోదయ్యాయి. 5,792 మందిలో 4,338 మంది పాస్ కావడంతో 74.9 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో జిల్లా 18వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎగబాకింది. జనరల్ ప్రైవేట్ సెకండ్ ఇయర్‌లో 32.7 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానం వచ్చింది. వోకేషనల్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ 59.81 శాతం, సెకండ్ ఇయర్ 72.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, వోకేషనల్ ప్రైవేట్ సెకండ్ ఇయర్‌లో 66.13 శాతం సాధించి రాష్ట్రంలో 3వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొత్తం ఫలితాల్లో బాలికలు మళ్లీ తమ ప్రతిభ చాటుకుని, బాలుర కంటే అధిక శాతం ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.






