- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుస్తులు ఉతికేందుకు వెళ్లిన యువతి చెరువులో పడి మృతి..
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువతి మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలంలో జరిగింది.

X
దిశ, గంభీరావుపేట: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువతి మృతి చెందిన ఘటన మంగళవారం గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన బంటు జ్యోతి(25) ఊరి పక్కన ఉన్న చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. అక్కడ దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఎంతసేపటికీ జ్యోతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు చెరువు వద్దకు చేరుకొని గాలించారు. చెరువులో యువతి మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






