- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్లింలకు లక్ష రూపాయలు కానుకలు.. హామీ నెరవేర్చిన మాజీ సర్పంచ్
పదవుల్లో ఉండి హామీలను అమలు చేయని ప్రజా ప్రతినిధులు ఉన్న నేటి రోజుల్లో ఓ గ్రామ సర్పంచ్ పదవీ విరమణ అనంతరం ముస్లింలకు భారీ సహాయం చేసి వారి అభిమానానికి పాత్రుడయ్యాడు.

దిశ, శంకరపట్నం : పదవుల్లో ఉండి హామీలను అమలు చేయని ప్రజా ప్రతినిధులు ఉన్న నేటి రోజుల్లో ఓ గ్రామ సర్పంచ్ పదవీ విరమణ అనంతరం ముస్లింలకు భారీ సహాయం చేసి వారి అభిమానానికి పాత్రుడయ్యాడు. మండలంలోని కరీంపేట గ్రామ సర్పంచ్ వనపర్తి మల్లయ్య పదవీ కాలం ముగిసిన తర్వాత తాను ఇచ్చిన హామీ మిగిలిపోయిందని గుర్తించి ఆ హామీని నెరవేర్చుకున్నాడు. సహజంగా పదవీలో ఉండంగానే ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకులు.. తన హామీని గుర్తుంచుకొని మరి సహాయం చేయడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. మత పెద్దల సమక్షంలో మజీద్ అవసరాల నిమిత్తం లక్ష రూపాయల విలువ గల వంట పాత్రలను ముస్లిం పెద్దలకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఏగ్గని రమేష్, మాజీ ఉప సర్పంచ్ చింతం కుమారస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాండ్ల రాజయ్య, ఆడెపు దశరథం, ఆడేపు దామోదర్, వనపర్తి ప్రసాద్, వనపర్తి అశోక్,అనిల్, హరీష్, బొజ్జ స్వామి పాల్గొన్నారు.






