రాజన్న సేవలో GHMC మేయర్ విజయలక్ష్మి

by velandi.Saikiran |

వేములవాడ రాజన్నను సోమవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

రాజన్న సేవలో GHMC మేయర్ విజయలక్ష్మి
X

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్నను సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ప్రీతికైన కోడె మొక్కులు చెల్లించుకొని, అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కళ్యాణ మండపంలో వారికి వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనం గావించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. మేయర్ వెంట ఆలయ ప్రోటోకాల్ సహాయక కార్యనిర్వాహణాధికారి గోవిందుల అశోక్ కుమార్, పర్యవేక్షకులు వేదాంతం శ్రీకాంతచార్యులు, ఓడెపు వెంకట ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ మహేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Next Story