షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లప‌ల్లి శంకర్ ఓ గాడిద

by Nallavelli.Anjaneyulu |

షాద్ న‌గ‌ర్ ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్ కుమ్మెర గ్రామానికి వెళ్లి నిందితుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచి ర‌జకుల‌పై దుష్ప్ర‌చారానికి తెర లేపార‌ని తెలంగాణ వ్యాప్తంగా ఆయ‌న‌పై కుల సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లప‌ల్లి శంకర్ ఓ గాడిద
X

దిశ, కరీంనగర్ రూరల్ : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో కుమ్మెర గ్రామంలో రెండు నెల‌ల చిన్నారి మృతి చెందిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు బాధితుల ప‌క్షాన నిల‌బ‌డి న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇదే స‌మ‌యంలో షాద్ న‌గ‌ర్ ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్ కుమ్మెర గ్రామానికి వెళ్లి నిందితుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచి ర‌జకుల‌పై దుష్ప్ర‌చారానికి తెర లేపార‌ని తెలంగాణ వ్యాప్తంగా ఆయ‌న‌పై కుల సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఆదివారం కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో గీత భవన్ చౌరస్తా (తెలంగాణ చౌక్ ) లో ఎమ్మెల్యే ఓ గాడిద అంటూ నినాదాలు చేస్తూ శంకర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.


ఈ సందర్భంగా జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్ మాట్లాడుతూ వీర్లప‌ల్లి శంకర్ తన స్వార్ధ రాజకీయాల కోసం రజక జాతిని కించపరిచే విధంగా మాట్లాడి మంత్రి పదవి పొందాలని దురుద్దేశంతోనే గణేష్ కుటుంబాన్ని అపఖ్యాతి చెందే విధంగా మాట్లాడాడ‌ని తెలిపారు. రెండు నెలల పాప చనిపోతే ఆ పాప శవం పైన మంత్రి పదవి పొందడం కోసం రెడ్డి సంక నాకడానికి ఆ పాప మరణాన్ని అనారోగ్య సమస్యతో చనిపోయిన చనిపోయింది అంటూ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే వీర్లపల్లి శంకర్ ని రజక జాతి క్షమించ‌దు అని హెచ్చరించారు. ర‌జ‌క‌కులంలో పుట్టి రెడ్డిల‌కు వత్తాసు ప‌లుకుతారా అంటూ ఫైర్ అయ్యారు.


తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నీచపు రాజకీయాలను మానేసి తక్షణమే బాధ్యతలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. బాధితులకు కోటి రూపాయల ఆర్థిక సహాయం, ఇంట్లో ఒక ఉద్యోగం కల్పించాలని జిల్లా రజక సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూత్కూరి శివకృష్ణ, జిల్లా నాయకులు, రాచకొండ కొమురయ్య, పూసల శ్రీకాంత్ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, కేశపట్నం మండల అధ్యక్షులు తాడిచర్ల తిరుపతి, కొత్తపల్లి అధ్యక్షుడు జంగాలపల్లి బిజిగిరి నవీన్, కొమురయ్య, జంగాలపల్లి శంకర్, విద్యానగర్ ప్రెసిడెంట్ నగునూరి బాలరాజు పాల్గొన్నారు.

Next Story