- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేంజర్స్పాట్లు.. ప్రమాదాలకు నిలయంగా గంగాపురి
మంథని మండలంలో కొన్ని రోడ్లు ప్రమాదాలకు నిలయం గా మారాయి. అందులో మంథని పట్టణం గంగాపురి, ముత్తారం, పెద్దపల్లి వెళ్లే మూడు రోడ్డులను కలుపు మూల మలుపు వద్ద రహదారి పై ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఈ రహదారి వెంబడి వందలాది వాహనాలు వెళ్తుంటాయి.

దిశ,మంథని : మంథని మండలంలో కొన్ని రోడ్లు ప్రమాదాలకు నిలయం గా మారాయి. అందులో మంథని పట్టణం గంగాపురి, ముత్తారం, పెద్దపల్లి వెళ్లే మూడు రోడ్డులను కలుపు మూల మలుపు వద్ద రహదారి పై ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఈ రహదారి వెంబడి వందలాది వాహనాలు వెళ్తుంటాయి. గంగాపూరి వద్ద బోయిన్ పేటకు చెందిన ఓ యువకుడు ట్రాక్టర్ ను ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. అదే విధంగా ముత్తారం నుంచి బైక్ పై వస్తున్నా ఇద్దరు యువకులు ఓ లారీ ఢీకోనడంతో ఓ యువకుడు అక్కడక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు.ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో ఓ వ్యక్తి కాలు విరిగింది. ఈ నెల 4 న పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి ని ఇసుక లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ని ప్రమాదాలు జరిగిన కూడా ప్రమాదాల నివారణను అధికారులు పట్టించుకోవడం లేదు. అదే విధంగా ముందస్తుగా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు బోర్డు ఏర్పాటు చేయలేదు. ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? అని సంబంధిత అధికారులపై వాహనదారులు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబందింత అధికారులు ప్రమాదాలు జరగకుండా ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి ప్రమాదలను నివారిం చాలని కోరుతున్నారు.
ప్రమాదాలకు పలు స్పాట్ లు...
మంథని మండలంలో పలు చోట్లు ప్రమాదాలకు స్పాట్ లుగా మారాయి. మంథని పాత పెట్రోల్ బాంక్ ప్రమాదాలకు స్పాట్ గా మారింది. ఇక్కడ కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అదే విధంగా మంథని, కాటారం సూరయ్యపల్లి, వెళ్లే మూడు రహదారులను కలుపు ప్రధాన రహదారి పై కూడా ప్రమాదలు జరుగుతున్నాయి. ఇదే కాక మంథని టూ ముత్తారం, పెద్దపల్లి నుంచి కాటారం, మంథని నుంచి గోదావరిఖనికి సూరయ్యపల్లి నుంచి ఖమ్మంపల్లి కి వెళ్లే ప్రధాన రహదారులతో పాటు గ్రామాలకు వెళ్లే రహదారులకు వెళ్లే కొన్ని చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా సంబంధిత అధికారులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
సీపీఎం జిల్లా నాయకులు బూడిద గణేష్..
ప్రమాదాలు జరిగిన కూడా అధికారులు పట్టించుకోవడం లేదు.మంథని మండలంలో ప్రమాదాలకు స్పాట్ లుగా మారాయి. దీంతో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారు. సంబంధిత అధికారులు దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలి..






