- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామగుండంలో మితిమీరుతున్న కాంగ్రెస్ నాయకుల గుండాయిజం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల గుండాయిజం మితి మీరిపోతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి పేర్కొన్నారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ : రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల గుండాయిజం మితి మీరిపోతుందని, భౌతిక దాడులు, బెదిరింపులు, వేధింపులతో అరాచకాలు చేస్తున్నారని, ఖబడ్దార్ గులాబీ శ్రేణులు, కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టమని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కౌశిక హరి హెచ్చరించారు. శనివారం ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. నియోజకవర్గంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అతని అనుచరులు, అధికార పార్టీ లీడర్ల అరాచకాలు మితి మీరిపోతున్నాయని, ఇష్టారీతిన బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతూ భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియంతల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నారని విమర్శించారు. రాబోయేది బీఆర్ఎస్ సర్కార్ అని అరాచకాలకు పాల్పడుతున్నాయి ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని, గులాబీ శ్రేణులు కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అధికార అహంకారంతో కార్పొరేటర్ గా గెలిచిన టిఆర్ఎస్ పట్టణ నాయకుడు గూడెల్లి రామచందర్ పై దాడి చేయడం అమానుషమని అన్నారు. నియోజకవర్గంలో ప్రజా పాలన కాదు కాకిల పాలన నడుస్తుందని, కాంగ్రెస్ కార్యకర్తలు లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులు తీరు మార్చుకోవాలని హితో పలికారు లేని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. కార్పొరేటర్లు తాళ్ల చిన్న రాజయ్య, మందల రమ కిషన్ రెడ్డి, టౌన్ కమిటీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






