తాళం వేసిన ఇంట్లో చోరీ

by Bhanu |

మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ
X

దిశ, గంగాధర : మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఆదివారం చీకటి పడ్డాక తన ఇంటికి తాళం వేసి త్రాగునీరు తీసుకువచ్చేందుకు వెళ్లగా, తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి, ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న 33 తులాల పైగా బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్టు గంగారెడ్డి గుర్తించి, వెంటనే గంగాధర పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్సై బి వంశీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు.



Next Story