ఎద్దుల బండిపై గ‌ణ‌ప‌తి..ప‌ట్ట‌ణంలో అరుదైన దృశ్యం

by velandi.Saikiran |

నవరాత్రి వేడుకల నేప‌థ్యంలో ఊరంతా గణపతి బ‌ప్పా మోరియా అనే నినాదాలతో మార్మోగుతుంటే ఎద్దుల బండిపై ఓ వినాయ‌కుడు

ఎద్దుల బండిపై గ‌ణ‌ప‌తి..ప‌ట్ట‌ణంలో అరుదైన దృశ్యం
X

దిశ వేములవాడ టౌన్ : నవరాత్రి వేడుకల నేప‌థ్యంలో ఊరంతా గణపతి బ‌ప్పా మోరియా అనే నినాదాలతో మార్మోగుతుంటే ఎద్దుల బండిపై ఓ వినాయ‌కుడు మెరిసాడు. అది కూడా వేముల‌వాడ ప‌ట్ట‌ణం కావ‌డం విశేషం. ఎద్దుల బండిపై పచ్చని అరిటాకులతో అలంకరించిన గణనాధుని విగ్రహం, గులాబీ పూలతో విరబూసినట్టుగా కనిపిస్తోంది. ఎద్దులు నిండుగా అలంకరించ‌డంతో... అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ స‌న్నివేశం ఒక విందులా, పండుగలా మారిపోతుంది.

Next Story