- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ రూరల్ నూతన తహశీల్దార్ గా జి. నర్సింగరావు
కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎన్. రాజేష్ ను బదిలీ చేస్తూ కలెక్టర్ చిత్ర మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది కొత్తపల్లి మండలం నుంచి కరీంనగర్ మండలంకు బదిలీపై వచ్చారు రాజేష్.

X
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎన్. రాజేష్ ను బదిలీ చేస్తూ కలెక్టర్ చిత్ర మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది కొత్తపల్లి మండలం నుంచి కరీంనగర్ మండలంకు బదిలీపై వచ్చారు రాజేష్. కరీంనగర్ రూరల్ కు వచ్చిన కొంత కాలానికే తహసీల్దార్ల ట్రాన్సఫర్ లో భాగంగా జగిత్యాల జిల్లాకు బదిలీ కాగా.. చివరి నిమిషంలో రద్దు చేశారు అధికారులు. తాజాగా శుక్రవారం రాజేష్ ను కలెక్టర్ హెచ్.సెక్షన్ సూపరింటెండెంట్ గా బదిలీ చేస్తూ కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గా జి.నర్సింగరావుని నియమించారు కలెక్టర్ చిత్రమిశ్రా. శనివారం కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గా జి.నర్సింగరావు బాధ్యతలు స్వీకరించగా కార్యాలయం సిబ్బంది పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటి.వైశాలి, ఆర్ఐ లు వాస్తవిక్ గౌడ్, కనకరాజు, సర్వేయర్ సంతోష్ పాల్గొన్నారు.
Next Story






