- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మడిహట్టి బ్యారేజ్‌కు నిధులు కేటాయించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దిశ, జగిత్యాల టౌన్ : ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో రెండు సంవత్సరాల్లో రూ.10,000 కోట్ల నిధులు కేటాయించి తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే గోదావరి దిగువకు వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ దిశగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేసి ప్రాణహిత నది జలాలను వినియోగించేందుకు తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని గుర్తు చేశారు. ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని అందించే అవకాశం ఉందన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు త్రాగునీరు సరఫరా చేయడానికీ ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పారు. తుమ్మడిహట్టి బ్యారేజ్ పనులు టెండర్ దశలోనే నిలిచిపోయాయని, ప్రస్తుతం ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డలో ఏడో బ్లాక్ కుంగిపోవడంతో నీటి తరలింపు వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ సూచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మరమ్మతులు చేపట్టి తరువాత కాంట్రాక్టర్ వద్ద నుంచి ఖర్చులను రికవరీ చేసుకోవచ్చని, అవసరమైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేపట్టవచ్చని అన్నారు.
మేడిగడ్డ పునరుద్ధరణ చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఎన్నికల ప్రణాళికలో కూడా దీనిని చేర్చినట్టు చెప్పారు. తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపడతామని రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. 152 మీటర్ల స్థాయిలో నీటిని తరలించేందుకు తవ్విన కాలువలను 148 మీటర్ల స్థాయికి అనుగుణంగా రీడిజైన్ చేయవచ్చని తెలిపారు. జైపూర్ వాగు నుంచి సుందిల్ల లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉందన్నారు. తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం, నీటి తరలింపు, కాలువల రీడిజైన్ పనులు కలిపి రూ.10 వేల కోట్లలోపు పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. గోదావరి, ప్రాణహిత నదుల జలాలు రాష్ట్రానికి ఆయువు పట్టు వంటివని అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మూసినది ప్రక్షాళనకు కూడా ఈ నీటిని వినియోగించుకోవచ్చని అన్నారు.






