- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ లో రంగుల కేళి
హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో సందడి చేశారు.

దిశ, హుజరాబాద్ రూరల్ : రంగుల పండుగ హోలీ వేడుకలు హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. కుల, మతాలకు అతీతంగా రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి నాయకులు, అధికారులు, ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా హుజరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలు పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రజా ప్రతినిధులు, అధికారులతో సందడి
బుధవారం ఉదయం నుంచి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పట్టణంలోని ప్రముఖులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి కామని రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల బృందం మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, టౌన్ సీఐ కరుణాకర్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధికలను కలిసి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసులకు, ప్రజా సేవలో ఉండే నాయకులకు ప్రెస్ క్లబ్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అంతా రంగుల మయం
పట్టణ ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ చౌరస్తా జర్నలిస్టులు, రాజకీయ నాయకుల కలయికతో రంగులమయమైంది. వృత్తి పరమైన ఒత్తిడిని పక్కన పెట్టి వార్తా సేకరణలో నిరంతరం బిజీగా ఉండే జర్నలిస్టులు, నాయకులతో కలిసి కేరింతలు కొడుతూ పండుగను ఆస్వాదించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ పండుగ సందేశాన్ని పంచుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్రావు, జన్నోజు భాస్కర్, బండ నరేష్, గోస్కుల రాజకుమార్ ,బీజేపీ నాయకులు తూర్పాటి రాజు, నరాల రాజశేఖర్, పైళ్ళ వెంకట్రెడ్డి, యమ్సని శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, తిప్పబత్తిని రాజు, కొండ మురళి పాల్గొన్నారు.






