కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషి

by velandi.Saikiran |

కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందని రామగుండం

కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషి
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందని రామగుండం రీజియన్-2 ఎస్వోటూ జీఎం మాలోత్ రాముడు అన్నారు. మంగళవారం రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్-3లో అఫ్ లోడింగ్ ఓవర్ బర్డెన్(మట్టి తొలగింపు) ఆర్విఆర్ కంపెనీ క్యాంపులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..బొగ్గు ఉత్పత్తి ఉత్పదాకతతో పట్టు ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్దతో కృషి చేస్తోందని అన్నారు.

ఉత్పత్తి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులకు సైతం యాజమాన్యం అదే ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.ఉదోగుల సంక్షేమంతో పాటు పరిసర, ప్రభావిత గ్రామాల అభివృద్ధి, సౌకర్యలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికుల కొరకు ఎన్నో పధకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ సుజన్ మెహ్రా, ఏరియా రక్షణాధికారి సంతోష్ కుమార్, ఓసీపీ-3 ప్రాజెక్ట్ అధికారి ఉదయ్ హరిజన్, సింగరేణి సెక్టార్-3 హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ మహిపాల్, డాక్టర్ సాహితి, ఓసీపీ-3మైన్ మేనేజర్ లక్ష్మణ్ రావ్, సంక్షేమాధికారి అజీజ్ పాల్గొన్నారు.

Next Story