దొంగ‌తనం కేసులో న‌లుగురు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దొంగతనం కేసులో నలుగురిని అరెస్టు చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు.

దొంగ‌తనం కేసులో న‌లుగురు అరెస్ట్
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ : దొంగతనం కేసులో నలుగురిని అరెస్టు చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్ స్టోర్ రూమ్ లో కరెంట్ కి సంబంధించిన సుమారు రూ. 60వేలు విలువగల కరెంట్ వైర్ బెండల్స్ ను దొంగలించినట్లు బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో గురువారం ఉదయం తీగలగుట్టపల్లి నుంచి ఆరేపల్లికి వెళ్లే దారిలో ఎల్లమ్మ గుడి దగ్గరలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నేరస్థులైన బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజీ ,సూర నవీన్ లపై మోమో జారీచేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో ఎస్ లక్ష్మారెడ్డిని కానిస్టేబుల్స్ సల్మాన్, అఫ్జల్ ను సీఐ అభినందించారు.

Next Story