- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > సాహెబ్ ను పరామర్శించిన మావోయిస్టు మాజీ ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరి భూషణ్
సాహెబ్ ను పరామర్శించిన మావోయిస్టు మాజీ ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరి భూషణ్
by Ratna Kumari |
జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్. కే సాహెబ్ కుమారుడు నజీబ్ కూతురు నిన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్. కే సాహెబ్ కుమారుడు నజీబ్ కూతురు నిన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం నజీబ్ కు కూతురు జన్మించింది. మరుసటి రోజే చిన్నారి మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. సమాచారం తెలుసుకున్న మావోయిస్టు మాజీ ఉత్తర తెలంగాణ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరి భూషణ్ ఇవాళ కొద్దిసేపటి క్రితం పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఆయనతోపాటు సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య ఏఏంసీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్, కొంరిశెట్టి తిరుపతి, నాయకులు వంగగిరిధర్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి మెండే శ్రీనివాస్ యాదవ్ మద్దుల పద్మారెడ్డి షకిల్ తదితరులు ఉన్నారు.
Next Story






