- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూట్యూబర్ వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన యూ ట్యూబర్, గర్భిణీ వైష్ణవి కుటుంబాన్ని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గురువారం పరామర్శించారు.

దిశ, కోరుట్ల రూరల్ : కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన యూ ట్యూబర్, గర్భిణీ వైష్ణవి కుటుంబాన్ని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గురువారం పరామర్శించారు. మృతురాలి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చిన ఆయన, ఈ అమానుష ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గర్భిణీ అని చూడకుండా వైష్ణవి ని అత్యంత క్రూరంగా హత్య చేయడం సమాజానికే మచ్చ అని, ఇలాంటి ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని, భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. బాధిత కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈయన వెంట మాదాపూర్ మాజీ సర్పంచ్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ తో పాటు స్థానిక నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.






