- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ganesh Immersion : మన్నించు వినాయక.. నిమజ్జనం నిర్లక్ష్యం
నిమజ్జన ఏర్పాట్లలో హడావిడి చేసిన అదికారులు ఆచరణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

దిశ బ్యూరో కరీంనగర్ : నిమజ్జన ఏర్పాట్లలో హడావిడి చేసిన అదికారులు ఆచరణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిమజ్జన కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించడంతో గణనాథుని ప్రతిమలు నీట మునగకుండానే మమా అనిపించారని వినాయక మండప నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మూడు నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ నిన్న సాయంత్రం మొదలైన నిమజ్జన ప్రక్రియ ఈ రోజు 1:30 గంటల వరకు సాగింది. అదికారుల అలసత్వంతోనే నిమజ్జన ప్రక్రియ ఆలస్యం జరిగినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
నిమజ్జన ప్రక్రియ భేష్ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
నిమజ్జన ఏర్పాట్ల ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అదికారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రెస్ విడుదల చేసిన మంత్రి బండి సంజయ్ అధికారులను అభినందించారు.






