- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో ఘనంగా ఫుడ్ సేఫ్టీ డే
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాలలో సోమవారం ఫుడ్ సేఫ్టీ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో 'ఈట్ రైట్' పై అవగాహన కల్పించేందుకు మినీ స్టేడియం నుంచి తహశీల్ చౌరస్తా వరకు నిర్వహించిన వాకథాన్‌ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ప్రారంభించారు.

దిశ, జగిత్యాల టౌన్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాలలో సోమవారం ఫుడ్ సేఫ్టీ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో 'ఈట్ రైట్' పై అవగాహన కల్పించేందుకు మినీ స్టేడియం నుంచి తహశీల్ చౌరస్తా వరకు నిర్వహించిన వాకథాన్‌ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. ఉప్పు, చక్కెర, నూనె వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఖరీదైన పండ్ల కంటే ఆయా సీజన్లలో దొరికే పండ్లు తిన్నా మంచి పోషకాలు అందుతాయని చెప్పారు. సరైన ఆహారంతో పాటు రోజూ 30 నిమిషాల నడక వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా హోటల్ వ్యాపారులకు శిక్షణ, ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించారు. అలాగే సాయంత్రం కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేసి నాణ్యమైన నిత్యావసరాలను గుర్తించడంపై అవగాహన కల్పించారు.






