వేములవాడలో ఫ్లెక్సీ వివాదం

by Elthuri vijay kumar |

వేములవాడ పట్టణంలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు.

వేములవాడలో ఫ్లెక్సీ వివాదం
X

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నాయకులు

వేములవాడలో ఫ్లెక్సీ వివాదం

పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ పట్టణంలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన కాస్త ఇప్పుడు వేములవాడ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీలో గత కొంతకాలంగా వర్గ విభేదాల టాక్ కొనసాగుతున్న నేపథ్యంలో సొంత పార్టీ వారే ఈ పనికి ఒడిగట్టారా...? లేదంటే ఇది ఇతర పార్టీలకు చెందిన వారి పనేనా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story