పిచ్చి కుక్క స్వైర విహారం

by Ratna Kumari |

పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆ పిచ్చి కుక్క కు కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

పిచ్చి కుక్క స్వైర విహారం
X

దిశ, తంగళ్లపల్లి : పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆ పిచ్చి కుక్క కు కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కేవలం అరగంట వ్యవధిలోనే ఏకంగా ఐదుగురిని కరవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఐదేళ్లలోపు చిన్నారులు ఉండ‌టం గ‌మ‌నార్హం. అలాగే మరో ఇద్దరు యువకులు, ఒక మహిళను కూడా పిచ్చికుక్కలు విచక్షణ రహితంగా కరవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిట్యాల రాణా ప్రతాప్ అనే బాలుడి ముఖం చెవి పై కరవడంతో విల విలలాడిపోయాడు. అలాగే క్యారమ్ శ్రీధర్, బోయిని నంద కిషోర్ పై దాడి చేయడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story