పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

by Ratna Kumari |

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్దిపేట మండలంలోని దుమాల గ్రామానికి చెందిన నీరంక లత అనే (ఆశా వర్కర్) క్యాన్సర్

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్దిపేట మండలంలోని దుమాల గ్రామానికి చెందిన నీరంక లత అనే (ఆశా వర్కర్) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో ఎల్లారెడ్డిపేట జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త‌ పాఠశాల(2002-2003) బ్యాచ్ స్నేహితుల సహకారంతో 14 వేల రూపాయలు ఆర్థిక సహాయం బుధవారం అందించారు. నీరంక లత భర్త రవి బ్రెయిన్ హిమరేజ్ (రక్తస్రావం) వ్యాధి బారిన పడటంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకొని మళ్లీ క్లాస్మేట్స్ సహకారంతో రూ. 31 వేలు ఆర్థిక సహాయం అందించారు. వివిధరకాల సోషల్ మీడియాల ద్వారా ఇంకా కూడా డబ్బులు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఆమె మిత్రులు పేర్కొన్నారు. గతంలో కొన్ని కుటుంబాలకి కూడా మా క్లాస్మేట్స్ సహకారంతో దుమాల గ్రామంలో ఇప్పటివరకు 1లక్ష 9 వేల రూపాయలు అందించారు. సహాయం అందించిన స్నేహితులందరికీ దుమాల గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎంత పెద్ద కష్టమైనా ఎక్కువ మంది పంచుకుంటే చిన్నదవుతుందని ఆమె మిత్రులు అన్నారు. ఇంకా నీరంక లత (ఆశా వర్కర్) భర్త రవికి బ్రెయిన్ హిమరేజ్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకొని ఎల్లారెడ్డిపేట జ‌డ్పీహెచ్ఎస్ క్లాస్మేట్స్ కలిసి రూ.31వేలు ఆర్థిక సాయం అందించారు. అందించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Next Story