జమిందారి, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయ‌న్న : ప్రజా సంఘాల నాయకులు

by Nallavelli.Anjaneyulu |

దిశ,​ హుజురాబాద్ రూరల్ : బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై జమిందారీ వ్యవస్థపై

జమిందారి, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయ‌న్న : ప్రజా సంఘాల  నాయకులు
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై జమిందారీ వ్యవస్థపై పోరాడిన బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలను హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నాయకులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న ముదిరాజ్ 1860 నుండి 1900 కాలంలో నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకించారని బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్న జమిందారి, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ధీశాలీగా పోరాడారని కొనియాడారు.


ఆయన సంపన్న వర్గాలను కొల్లగొట్టి పేద వర్గాలకు పంచిన గొప్ప వ్యక్తి అని అందుకే ఆయనను 'తెలంగాణ రాబిన్ హుడ్'గా అభివర్ణించారు. ముఖ్యంగా ఆయన ప్రత్యేక బీసీ సామ్రాజ్యం కోసం, సామాజిక న్యాయం దిశగా పోరాటాలు చేస్తూ బీసీల సామ్రాజ నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, హనుమాన్ టెంపుల్ చైర్మన్ కొలిపాక శంకయ్య, సొల్లు బాబు, వేల్పుల రత్నం, దాసరి సంఘం నాయకులు తులసి లక్ష్మణమూర్తి, మైనార్టీ నాయకులు ఖలీద్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ ముక్కా రమేష్, ఇప్పకాయల సాగర్, ఉప్పు శ్రీనివాస్, కేఆర్ భిక్షపతి, న్యాయవాది కామని సమ్మయ్య, ఎర్రబోజు నారాయణ పాల్గొన్నారు.

Next Story