- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతన్నకు ఫర్టిలైజర్ యాప్ కష్టాలు
యూరియా పక్కదారి పట్టకుండా ప్రవేశపెట్టిన 'ఫర్టిలైజర్ యాప్' విధానం హుజూరాబాద్ సబ్ డివిజన్ రైతులకు చుక్కలు చూపిస్తోంది.

యాప్తిప్పలు
రైతన్నకు ఫర్టిలైజర్యాప్కష్టాలు
స్మార్ట్ ఫోన్లేకఅవస్థలు
ఉన్నా అర్థం కాక ఇబ్బందులు
సాగుకు అందని యూరియా
సాంకేతికత శాపంగా మారింది
ఎరువుల కోసం పడిగాపులు...
పాత పద్దతిలోనే ఇవ్వాలని డిమాండ్
దిశ,హుజురాబాద్ రూరల్: రైతు కొంగర మొగిలి. గ్రామం సిరస పల్లి. ఇతను రెండెకరాల వరి పొలం సాగు చేస్తున్నాడు. ఈయనకు స్మార్ట్ ఫోన్ లేదు. దీంతో యూరియా బుక్ చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. వరి పొలం నాటేసి రెండు నెలలు దాటింది. అదును దాటితే వరి పంట పెరిగే అవకాశం లేదు. ఇది ఈ ఒక్క కొంగర మొగిలి సమస్య కాదు స్మార్ట్ ఫోన్ వాడని ఎందరో రైతుల పరిస్థితి ఇది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబం ధనలు క్షేత్ర స్థాయిలో అన్నదా తలకు శాపంగా మారుతున్నాయి. యూరియా పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫర్టిలైజర్ యాప్' విధానం హుజూరాబాద్ సబ్ డివిజన్ రైతులకు చుక్కలు చూపిస్తోంది. నాట్లు వేసి రెండు నెలలు గడుస్తున్నా ఎరువులు అందక పంట ఎదుగుదల ఆగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ లేక.. యాప్ అర్థం కాక
హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఆరు మండలాల పరిధిలో యాసంగి సీజన్‌లో సుమారు 85 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అయితే యూరియా కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలన్న నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. సుమారు 60 శాతం మంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు. ఉన్నవారికి కూడా యాప్ నిర్వహణపై అవగాహన లేకపోవడంతో ఇతరుల సహాయం కోరాల్సి వస్తోంది. యాప్‌లో బుకింగ్ చేసుకున్న వారికే ఎరువులు ఇస్తుండటంతో సామాన్య రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు గంటల తరబడి వేచి చూస్తున్నారు. స్టాక్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వరి నాట్లు వేసి 60 రోజులు దాటుతున్నా తగినంత యూరియా అందకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో ఎరువులు వేయకపోతే దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని అప్పులు తెచ్చి సాగు చేస్తున్న తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పాత పద్ధతిలోనే మాకు ఎరువులు అందించాలి అని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడం మా వల్ల కావడం లేదు. చదువుకున్న వాళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
12 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ పూర్తి..
ఏడీఏ సునీత
ఈ యాసంగి సీజన్‌కు మొత్తం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 12 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని తెలిపారు.మిగిలిన కోటా ఇంకా 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, అది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. చదువురాని రైతులకు సహాయం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఏఈవోలు, సొసైటీ సిబ్బంది, ఫర్టిలైజర్ డీలర్లు అందుబాటులో ఉన్నారని ఆమె వెల్లడించారు.






