వడదెబ్బతో మహిళా రైతు మృతి

by Ratna Kumari |

వ‌డ‌దెబ్బ‌తో అస్వ‌స్థ‌త‌కు గురై మ‌హిళా రైతు మృతి చెందిన ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కోన‌రావుపేట మండ‌లంలోని గొల్ల‌ప‌ల్లి(వ‌ట్టిమ‌ల్ల‌) గ్రామంలో చోటు చేసుకుంది.

వడదెబ్బతో మహిళా రైతు మృతి
X

దిశ, కోనరావుపేట : వ‌డ‌దెబ్బ‌తో అస్వ‌స్థ‌త‌కు గురై మ‌హిళా రైతు మృతి చెందిన ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కోన‌రావుపేట మండ‌లంలోని గొల్ల‌ప‌ల్లి(వ‌ట్టిమ‌ల్ల‌) గ్రామంలో చోటు చేసుకుంది. వ‌డ‌దెబ్బ‌తో మ‌రో మ‌హిళా రైతు మృతి చెందిన ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకుంది. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే గ్రామంలో వ‌డ‌దెబ్బ కార‌ణంగా ఇద్ద‌రు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికులు వివ‌రాల ప్ర‌కారం.. గ్రామానికి ఎర్ర‌గ‌డ్డం ల‌చ్చ‌వ్వ‌(55) మ‌హిళా రైతు ఐకేపీ కేంద్రంలో పోసిన త‌మ వ‌రి ధాన్యాన్ని ఎండ‌లో నేర్పుతున్న స‌మ‌యంలో తీవ్ర ఎండ వేడికి అస్వ‌స్థ‌త‌కు గురైంది.


అనంతరం ఇంటికి వెళ్లిన లచ్చవ్వకు కొద్ది సేపటికే నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం. మృతురాలికి భర్త లచ్చిరెడ్డి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం మండుతున్న ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామంలో వరుసగా వడదెబ్బ మరణాలు సంభవించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిరుపేద కుటుంబాలు పని చేస్తేనే పూట గడిచే పరిస్థితుల్లో ఎండ తీవ్రత మధ్య కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని గొల్లపల్లి సర్పంచ్ మాడుగుల ఆమని-శ్రీకాంత్ కోరారు. ఎండ తీవ్రతపై అధికారులు గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story