- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేయగా ప్రచారం కొనసాగింది. ఏకంగా ఓ వార్డు అభ్యర్థి కోటికిపైగా వెచ్చించినట్లు తెలిసింది. అయినా అభ్యర్థులను మాత్రం ఇంకా టెన్షన్ విడడం లేదు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా మువియగా ఓటు రూపంలో అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు. కాగా శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
పలు పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు
సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో ప్రధాన పార్టీల మధ్య చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఒక వార్డు పోలింగ్ బూత్ వద్ద బిఆర్ఎస్, బిజెపి నాయకుల మధ్య ఘర్షణ కాగా, మరో వార్డులో బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే మరో వార్డులో దొంగ ఓటు వేశారని కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరగగా, అక్కడక్కడ చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదాలు, ఘర్షణలు శాంతింపబడ్డాయి.
విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ
ప్రచారం అనంతరం జరిగే పంపకాల్లో సైతం ప్రధాన పార్టీలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించాయి. ఓటరును ప్రలోభ పెట్టేందుకు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేశాయి. సిరిసిల్లలో ఒక్క ఓటుకు కనిష్టంగా రూ.2 వేలు గరిష్టంగా రూ.10 వేలు పలికినట్లు సమాచారం. కొన్ని వార్డుల్లో రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మరికొన్ని వార్డుల్లో రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చినట్లు తెలిసింది. ఒక వార్డులో మాత్రం మాజీ కౌన్సిలర్ ఓటుకు రూ.10 వేలకు పైగా ఇచ్చి, దాదాపు కోటికి పైగా ఖర్చు చేసినట్లు వినబడుతోంది. ఎంత ఖర్చు చేసిన అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ విడడం లేదు.
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్
సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. 30,482 మంది పురుషులు, 33,709 మంది స్త్రీలు, 5గురు ఇతరులు మొత్తం 63,556 మంది తమ ఓటు హక్కు వినియోగించుకాగా, 75.56% పోలింగ్ శాతం నమోదయింది. పోలింగ్ సరళి తొలత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది.
బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో తమ జెండా ఎగరవేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్టు ప్రచారం చేశాయి. అభ్యర్థుల ప్రచార సరళిని గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్తు, అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఓటు వేసిన బ్యాలెట్ బాక్సులను అధికారులు అత్యంత భద్రతల నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి ఉండాల్సిందే.






