పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మర్రిపల్లి సత్యం

by Nallavelli.Anjaneyulu |

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :  మర్రిపల్లి సత్యం
X

దిశ, పెగడపల్లి : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రం లో బీజేపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని మామిడి, మొక్క జొన్న, వరి పంట నష్టం జరిగిందని జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని, పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి,మాజీ అధ్యక్షుడు గంగుల కొమురెల్లి,నాయకులు తోడేటి గట్టయ్య, కడారి జనార్ధన్,కోట మల్లేష్,జక్కుల హరీష్,శ్రీనివాస్, రాజి రెడ్డి, బీరయ్య, నిఖిల్ పాల్గొన్నారు.

Next Story