రైతు హితమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి లక్ష్మణ్ కుమార్

by Ratna Kumari |

గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రైతు హితమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ,పెగడపల్లి : గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని అయితుపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు నెలకు ఆరు వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీ పైన వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని అన్నారు. సన్న బియ్యం పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తున్నామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం తూకం చేయాలని తూకం పూర్తి అయిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు చేరవేసే బాధ్యత అధికారులు తీసుకోవాలని ట్రక్ షిట్ ఆధారంగా డబ్బులు చెల్లించాలని ఎలాంటి అలసత్వం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

మినీ మార్కెట్ యార్డ్ గా మార్చేందుకు కృషి

దశాబ్ద కాలంగా కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్న అయితుపల్లి రైతులకు ప్రభుత్వ స్థలం ఆరు ఎకరాలు కేటాయించి కొనుగోలు కేంద్రం మంజూరు చేశామని త్వరలోనే ఇట్టి కొనుగోలు కేంద్రాన్ని మినీ మార్కెట్ యార్డ్ గా మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితుపల్లి, నందగిరి గ్రామ ప్రజలు కొనుగోలు కేంద్రం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేటీఆర్ అహంకారపు మాటలు మానుకోవాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడని మండిపడ్డారు. పదేళ్లలో అక్రమ సంపాదన చేసి అదే అహంకారం తో మాటల మాట్లాడుతున్నాడని మీ అహంకారంకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నామని భావిస్తూ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని మరో రెండు అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమే అని అన్నారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్,అయితుపల్లి,నందగిరి గ్రామాల సర్పంచులు మ్యాకల అంజమ్మ,ధనియాల రజిత సురేష్,నందగిరి మాజీ సింగిల్ విండో చైర్మన్ కర్ర భాస్కర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగంపల్లి మహేష్,బాలుసాని శ్రీనివాస్ గౌడ్,మన్నె గంగ రాజేశం,చెట్ల కిషన్,చాట్ల విజయ్ భాస్కర్,మాజీ జెడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు,నాయకులు ఓరుగలి శ్రీనివాస్,కడారీ తిరుపతి,పూసల తిరుపతి పాల్గొన్నారు.

Next Story