రైతుల ధర్నా.. కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు..

by Bhanu |

పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకెపి సెంటర్లో సన్న వడ్లు కొనడం లేదని రైతులు రాస్తారోకో చేపట్టారు.

రైతుల ధర్నా.. కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు..
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకెపి సెంటర్లో సన్న వడ్లు సరైన ధరకు కొనడం లేదని రైతులు రాస్తారోకో చేశారు. ఆ సమయంలో పెద్దపల్లి వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేత అట్ల కుమార్, దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఛైర్మన్ రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇది చూసి ఆగ్రహించిన రైతులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు తరలివచ్చి పరిస్థితిని నియంత్రించి ట్రాఫిక్ సజావుగా సాగించేలా చేశారు.

Next Story