మొక్కజొన్న కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

by Ratna Kumari |

ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

మొక్కజొన్న కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన  రైతులు
X

దిశ, జమ్మికుంట : ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో గత పదిహేను రోజులుగా వ్యవసాయ మార్కెట్ లు, మిల్లుల చుట్టూ ప్రదక్షనలు చేస్తున్నారు. అయినా ఎవరు కొనకపోవడం తో ఆగ్రహం చెందిన రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మొగుళ్ళపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాల కు చెందిన మొక్కజొన్న రైతులకు మొక్కజొన్న పంటను అమ్మడానికి జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాలకు చెందిన మిల్లులకు ట్రక్ షీట్లు ఇచ్చారు అధికారులు. దీంతో మొక్కజొన్న ను ట్రక్ షీట్లు ఇచ్చిన మిల్లులకు తరలించగా.. తాము కొనుగోలు చేయమని తమ వద్ద ఇప్పటివరకే స్టాక్ ఉందని చెప్పడం తో గత రెండు రోజుల నుంచి మిల్లుల చుట్టూ ప్రదక్షనలు చేసిన రైతులు చివరికి రోడ్డెక్కారు. తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డు పై బైఠాయించి నినాదాలు చేశారు.

Next Story