- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
ట్రాన్స్ఫార్మర్ వద్ద పెరిగిన గడ్డిని తీసేస్తూ విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపింది.

దిశ,పెగడపల్లి: ట్రాన్స్ఫార్మర్ వద్ద పెరిగిన గడ్డిని తీసేస్తూ విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. ట్రైనీ ఎస్సై రవీందర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలం లోని నంచర్ల గ్రామానికి చెందిన ఎడ్ల రాజేందర్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద గల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను ఇతర రైతులతో కలిసి తీసివేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కుప్పకులగా తోటి రైతులు గమనించి హుటాహుటిన అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు రాజేందర్ రెడ్డి మృతి చెందినట్లు తెలిపారని మృతుడి భార్య ఎడ్ల వాణి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే రాజేందర్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కూతురు ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళగా అంతలోనే రాజేందర్ రెడ్డి మృతి చెందడం గ్రామస్తులను కలచి వేసింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.






