- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్లాపూర్ మండల పరిధిలోలని మొగిలిపేట గ్రామాంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, మల్లాపూర్: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్లాపూర్ మండల పరిధిలోలని మొగిలిపేట గ్రామాంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోరండ్ల రాజన్న (59) తనకు ఉన్న పొలంలో పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాయ్యాడు. అదేవిధంగా తన కూతుళ్ల వివాహాలు కూడా అప్పు చేసి చేశాడు. దీంతో తనకు ఉన్న భూమిని మొత్తం అమ్మివేసినా అప్పులు తీరలేదు. ఉపాధి లేక చివరకు భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేయగా అందులో కూడా నష్టపోయాడు. దీంతో జీవితంపై విరక్తి కలిగి రాజన్న బలవన్మరాణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య పోరండ్ల గంగవ్వ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






