స్వామీజీ వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..

by Bhanu |   (  Updated:2025-06-13 16:46:13  IST  )

అమాయక ప్రజలను స్వామి వేషంలో పూజలు చేస్తామంటూ నమ్మించి, లేనిపోని పూజల పేరుతో డబ్బు దోచుకుని,బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

స్వామీజీ వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
X

దిశ, కరీంనగర్ రూరల్ : అమాయక ప్రజలను స్వామి వేషంలో పూజలు చేస్తామంటూ నమ్మించి, లేనిపోని పూజల పేరుతో డబ్బు దోచుకుని,బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15 లక్షల 30 వేల నగదు,7 తులాల బంగారం,మూడు కార్లు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారంగత పదిహేను రోజుల క్రితం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ (25) తండ్రి కనకయ్య, ఆర్టీసీ వేములవాడ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఒక ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది.అతని తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, పది రోజుల క్రితం స్వామి వేషంలో ఉన్న ఒక వ్యక్తి గజ్జి ప్రవీణ్‌కు పరిచయమయ్యాడు.

అతను ప్రవీణ్ ఇంట్లో ఏమీ బాగోలేదని,ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, లేకపోతే అతని తండ్రి నెల రోజులలోపు చనిపోతాడని నమ్మబలికాడు. అందుకు పూజలు చేయాలని,కావాల్సిన పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని మాయమాటలు చెప్పి, విడతలవారీగా 15 లక్షల 30 వేల నగదు గజ్జి ప్రవీణ్ వద్ద పూజల పేరుతో, పూజా సామాగ్రి పేరుతో వసూలు చేశాడు.డబ్బులు తీసుకున్న తర్వాత, నిందితులు కొంత పూజా సామాగ్రి కొనుగోలు చేసి, ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి, కుంకుమ, పసుపు చల్లి,అందులో నుంచి ఒక డబ్బా లో కిలో బంగారం ఉంటుందని చెప్పి ప్రవీణ్ ఇంటిలోని దేవుడి గదిలో పెట్టించారు.ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడుతూ నాన్నను ఇక్కడే చంపి పాతిపెడతాం" అని హెచ్చరించారు.వారి బెదిరింపులకు భయపడిన ప్రవీణ్, చుట్టుపక్కల వారి వద్ద నుండి మరికొంత డబ్బు తీసుకొని వారికి ఇవ్వడం జరిగింది అని పోలీసులు తెలిపారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ పాల్గొన్నారు.

Next Story