- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లె వెలుగు బస్సులో ఎక్స్ ప్రెస్ ఛార్జి వసూలు..!
మంథని బస్టాండ్ నుంచి కరీంనగర్ వెళ్తున్నటీఎస్ 22 టి 7244 పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేశారు.

దిశ, మంథని : మంథని బస్టాండ్ నుంచి కరీంనగర్ వెళ్తున్నటీఎస్ 22 టి 7244 పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేశారు. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు ప్రయాణికులకు బస్సు ఎక్కేముందే ఎక్స్ ప్రెస్ అని చెప్పాము కదా అని ఆ బస్సు కండక్టర్ సమాధానం చెప్పడం విశేషం. మంథని డిపో నుంచి గత కొద్ది రోజులుగా పల్లవెలుగు ఆర్డినరి బస్సులను వేసి ఎక్స్ ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని అధికారులకు చెప్పినప్పటికి మంథని డిపో యాజమాన్యం తీరు మారడం లేదంటున్నారు. పల్లె వెలుగు బస్సులు వేసి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్న మంథని బస్సు డిపో మేనేజర్ పై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. మంథని నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ చార్జీల పేరిట ఇబ్బందులకు గురి చేయవద్దని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకాల సురేష్ డిమాండ్ డిమాండ్ చేశారు.






