- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుమ్ము దూళి వస్తుందంటే.. దమ్ము చూపించాడు.. మాజీ కార్పొరేటర్ కొత్త రూల్..!
కరీంనగర్ పట్టణంలోని సీతారాంపూర్ 21వ డివిజన్‌లోని RTC కాలనీలో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో పొరుగింట్లోకి దుమ్ము, ధూళి, చెత్త వచ్చేది అడ్డుకోవాలని కోరిన ఓ ఉపాధ్యాయుడిపై మాజీ కార్పొరేటర్ దాడికి పాల్పడ్డారు.

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ పట్టణంలోని సీతారాంపూర్ 21వ డివిజన్‌లోని RTC కాలనీలో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో పొరుగింట్లోకి దుమ్ము, ధూళి, చెత్త వచ్చేది అడ్డుకోవాలని కోరిన ఓ ఉపాధ్యాయుడిపై మాజీ కార్పొరేటర్ దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం – మడుపు శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు, నిర్మాణ పనుల కారణంగా తమ ఇంట్లోకి ధూళి రాకుండా ఉండేందుకు పరదా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిని సరళంగా తీసుకోని మాజీ కార్పొరేటర్ జంగలి సాగర్, అతనిపై తీవ్రంగా ఆగ్రహంతో స్పందించి దాడికి దిగారు. దాంతో పాటు, వెంటనే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే "నిన్ను భూమి మీద లేకుండా చేస్తా" అంటూ బెదిరింపులు చేశారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.






