హుజూరాబాద్‌లో అడుగడుగునా కబ్జాలే.. పదుల ఎకరాలు అన్యాక్రాంతం.!

by Geesa Chandu |

హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణదారులను వణికిస్తున్న ఆపరేషన్ హైడ్రా.. జీహెచ్‌ఎంసీ‌తో పాటు హైదరాబాద్ నగర శివారులలోని మున్సిపాలిటీలు గ్రామాల్లోనూ ఆక్రమణలు, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ఎత్తుతుంది.

హుజూరాబాద్‌లో అడుగడుగునా కబ్జాలే.. పదుల ఎకరాలు అన్యాక్రాంతం.!
X

దిశ, హుజురాబాద్ రూరల్: హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణదారులను వణికిస్తున్న ఆపరేషన్ హైడ్రా.. జీహెచ్‌ఎంసీ‌తో పాటు హైదరాబాద్ నగర శివారులలోని మున్సిపాలిటీలు గ్రామాల్లోనూ ఆక్రమణలు, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ఎత్తుతుంది. ఎత్తైన భవనాలను నేలమట్టం చేస్తుంది. ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతూ ఆక్రమన దారుల,అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అదేవిధంగా హుజురాబాద్ లో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) తరహాలో ఆపరేషన్ అవసరమని హుజురాబాద్ పట్టణ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా కుంటలు,చెరువులు,తూములు, కట్టు కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. అణువణువునా అక్రమాలే చోటు చేసుకున్నాయి.ఎక్కడ సర్కారు జాగా ఖాళీగా ఉంటే అక్కడ ఆక్రమణదారులు పాగా వేస్తున్నారు. ఏకంగా భవనాలు సైతం నిర్మించారు. గంగోని కుంట, మాడల్ చెరువు,బట్టోనికుంట, చంద్రవోనికుంట తదితర గొలుసుకట్లు చెరువులు, కుంటలను, కట్టు కాలువలు, తూములను కబ్జారాయుళ్లు కబ్జా చేశారు. కట్టు కాలువలను మూసేసి ఫ్లాట్ లను ఏర్పాటు చేశారు. బట్టోని కుంట, గంగోని కుంట, మోడల్ చెరువు, చంద్రవాని కుంట ల పరిస్థితి మరి దయనీయంగా మారింది. శిఖం భూముల ఎఫ్ టి ఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) దాటిపోయి కుంటలు, చెరువుల గర్భం వరకు ఆక్రమించిన ఆనవాళ్లు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. కుంటలు, చెరువుల్లో పదుల ఎకరాల్లో భూములను ఆక్రమించారు .కట్టు కాలువలు,తూములను సైతం వదల్లేదు. ఎఫ్.టి.ఎల్ దాటడమే కాకుండా కట్టు కాలువలను సైతం వెంచర్లలో కలుపుకున్నారు. బట్టునికుంట, గంగోని కుంట క్రమంగా మూసేస్తున్నారు.

హైడ్రా ఇక్కడ అవసరమే...

గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు గంగోనికుంట, మోడల్ చెరువు ,చంద్రబోని కుంట, బట్టోను కుంట, కబ్జాలకు గురయ్యాయని ఫిర్యాదు చేసిన ఏలాంటి చర్యలు లేవు. ఇప్పటికి ఎఫ్డిఎల్ లో కబ్జాలు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూముల్లో నిర్మాణాలను అడ్డుకోవడం లేదు. బఫర్ జోన్లలో వెంచర్లు వేస్తున్న దాఖలాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో హైడ్రా ఆపరేషన్ లాగా హుజురాబాద్ లో కఠిన చర్యలు అవసరమన్న వాదన పట్టణ ప్రజల్లో పెరుగుతుంది.

పదుల ఎకరాలు అన్యాక్రాంతం...

ఆక్రమణదారులను గుర్తిస్తున్న కబ్జా చేస్తున్న వారిపై కబ్జా అయిందని నిర్ధారణ చేసుకున్న వారిపై ఎలాంటి చర్యలు ఉండడం లేదు. టౌన్ ప్లానింగ్ ,రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం ఉండడం లేదు. నిర్మాణాలను ఆరంభ సమయంలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. చెరువులు, కుంటల పూర్తిస్థాయి నీటిమట్టం పరిధిని నిర్దేశించకుండా జాప్యం చేస్తుండడం వల్లే కబ్జాలు పెరుగుదల కు కారణం అవుతున్నాయని తెలుస్తుంది.చెరువుల, కుంటల పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖలు అవినీతికి దాసోహం అంటున్నాయి .శిఖం భూముల్లో నిర్మాణం చేపట్టిన వాటికి కూడా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని ఇంటి నెంబర్లు జారీ చేస్తుండడం గమనార్హం.

కబ్జాలు మామూలు అయిపోయాయి...

కొలిపాక సమ్మయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు

హుజురాబాద్ లో కుంటలు ,చెరువులు, కట్టు కాలువలు, తూములు కబ్జా చేయడం మామూలు అయిపోయింది. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడు. నేను గత కొన్ని ఏళ్లు గా కుంటలు కబ్జాలు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తున్న తూతూ మంత్రంగా విచారణ చేసి వదిలేస్తున్నారు. రెవెన్యూ ,ఇరిగేషన్, ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నేపము నెట్టేస్తూ పట్టించుకోవడం లేదు. కళ్ళముందు కబ్జా చేసి కట్టడాలు నిర్మించిన ఏ ఒక్కరిని ఆపలేదు. కట్టిన వాటిని కూల్చలేదు. పైగా కబ్జాదారుల వద్ద డబ్బులు దండుకుంటున్నారు.

Next Story