వేగురుపల్లి మహిళా సంఘం లెక్కల్లో తప్పులు

by Jakkula.Mamatha |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, వేగురుపల్లి గ్రామంలోని వీరాంజనేయ మహిళా సంఘంలో గత కొన్ని రోజులుగా లెక్కల విషయంలో తలెత్తిన వివాదం కలకలం సృష్టించింది

వేగురుపల్లి మహిళా సంఘం లెక్కల్లో తప్పులు
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, వేగురుపల్లి గ్రామంలోని వీరాంజనేయ మహిళా సంఘంలో గత కొన్ని రోజులుగా లెక్కల విషయంలో తలెత్తిన వివాదం కలకలం సృష్టించింది. సంఘం లెక్కల్లో సీసీ మురళి కావాలనే తప్పులు చూపుతున్నారని ఆరోపిస్తూ, గ్రూప్ లీడర్ తప్పేట చంద్రమ్మ తీర్మానాన్ని వ్యతిరేకించారు. గ్రామంలోని అన్ని సంఘాల సభ్యుల ముందు లెక్కలను సరిగా చూపి సరిచేయాలని కోరినా, కేవలం ఒక గ్రూప్ సభ్యులను మాత్రమే పిలిచి తప్పుడు లెక్కలు చూపించారని చంద్రమ్మ ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, సిసి మురళి చేసిన లెక్కలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు ఎటువంటి తీర్మానాన్ని మేము అంగీకరించబోనని స్పష్టం చేస్తూ, సమావేశం నుంచి ఆమె తిరిగి వెళ్లిపోయారు. దీంతో మహిళా సంఘంలో తాత్కాలికంగా గందరగోళం నెలకొంది. ఈ సమస్య పై త్వరలో అందరి సమక్షంలో చర్చించి, స్పష్టత ఇస్తామని సంఘం సభ్యులు తెలిపారు.

Next Story