​వనమహోత్సవంతోనే పర్యావరణ పరిరక్షణ..

by Taduka Kalyani |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని హుజురాబాద్ పురపాలక సంఘ చైర్‌పర్సన్ సుహాసినీ రోంటాల పిలుపునిచ్చారు.

​వనమహోత్సవంతోనే పర్యావరణ పరిరక్షణ..
X

దిశ,​హుజురాబాద్ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని హుజురాబాద్ పురపాలక సంఘ చైర్‌పర్సన్ సుహాసినీ రోంటాల పిలుపునిచ్చారు. మంగళవారం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చైర్‌పర్సన్ అధ్యక్షతన వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్య నివారణకు, భవిష్యత్ తరాల మనుగడకు చెట్లు నాటడం ఎంతో అవసరమని, ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులతో పాటు మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఇంచార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సీనియర్ సహాయకులు శ్రీమతి వాణి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి. వినయ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story