మ‌హిళా సాధికారితే ధ్యేయం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

by Nallavelli.Anjaneyulu |

మహిళా సాధికారతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

మ‌హిళా సాధికారితే ధ్యేయం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
X

దిశ, కథలాపూర్ : మహిళా సాధికారతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న కోసం ప‌ర్య‌టించారు. మండలంలోని పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో 30 లక్షల నిధులతో నిర్మిస్తున్న మూడు మహిళ సమైక్య సంఘాల నూతన భవనాలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం రాజారాం తండా గ్రామంలో నూతన నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. పెగ్గెర్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంతో పాటు, తుర్తి గ్రామంలో పాత హనుమాన్ జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుండ్రా నారాయణ, మండలాధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎం. డి. అజీమ్, తహశీల్దార్ గుగ్గిళ్ల రమేష్, ఆర్ ఐ. రవీందర్, చెదలు సత్యనారాయణ, పులి హరిప్రసాద్, సర్పంచ్ తిరుపతి, న్యావనండి శేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story