నేను ఎక్క బిడ్డ ఎలక్ట్రికల్ బస్సు.. ఎక్కడ ఆగుతుందో ఎవరికి తెలుసు

by Bhanu |   (  Updated:2025-06-20 13:55:51  IST  )

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో రవాణా సేవలను వినియోగిస్తున్నారు.

నేను ఎక్క బిడ్డ ఎలక్ట్రికల్ బస్సు.. ఎక్కడ ఆగుతుందో ఎవరికి తెలుసు
X

దిశ, ఎల్లారెడ్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో రవాణా సేవలను వినియోగిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల పనితీరు నిరాశపరుస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. తాజాగా జరిగిన సంఘటనలో, ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ వద్ద నయరా పెట్రోల్ బంక్ సమీపంలో ఒక ఎలక్ట్రిక్ బస్ అచేతనమై నిలిచిపోయింది.

నిజామాబాద్ -2 డిపోకు చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు నిజామాబాద్‌కు వెళ్తుండగా, దారిలో సుమారు 65 మంది ప్రయాణికులతో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇదే సమయంలో వెనుక వస్తున్న బాన్సువాడ డిపోకు చెందిన TS17Z0045 నంబర్ బస్సులో ప్రయాణికులను ఎక్కించి గమ్యస్థానానికి పంపించాల్సి వచ్చింది.

ప్రస్తుతం ప్రతి రెండో మూడు రోజులకు ఇలా బస్సులు మధ్యలో నిలిచిపోతున్నాయని, ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో అర్థం కావడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. "ఎలక్ట్రిక్ బస్సు ఎక్కాలంటేనే భయంగా ఉంది. గమ్యం చేరతామన్న నమ్మకమే లేదు" అంటూ కొందరు వాపోతున్నారు.

ఈ తరహా సమస్యలు పునరావృతం కావడంతో, ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్ల వరకు నాణ్యమైన , సక్రమంగా నడిచే బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అధికారులు కోరుతున్నారు.

Next Story