- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని

దిశ, జగిత్యాల ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని రెండు విడతల్లో స్థానిక సంస్థలు మూడు విడుతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలకు తగు చర్యలు తీసుకొని రిపోర్ట్ అందించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎలక్షన్ షెడ్యూల్లో ఇచ్చిన వివరాలతో పాటు జిల్లాలో ఉన్న ఓటర్లు ఎన్నికల నిర్వహించేందుకు కావలసిన సిబ్బంది,పోలింగ్ బూతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. జిల్లాలో స్థానిక సంస్థలతో పాటు సర్పంచ్ ఎన్నికలు సైతం రెండు విడతల్లోనే పూర్తి అవుతాయాని తెలిపారు. ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డిపిఓ మదన్మోహన్, నూడల్ ఆఫీసర్లు ఎంపీడీవోలు ఇతర ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.






