- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడి వృద్ధుడు మృతి..
by Bhanu |
మండలంలోని గర్షకుర్తి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

X
దిశ,గంగాధర : మండలంలోని గర్షకుర్తి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఎస్సై బీ. వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి గ్రామానికి చెందిన చెరుకు వెంకటయ్య (71) గర్షకుర్తి గ్రామంలో దుర్గమ్మ పూజ కార్యక్రమం కోసం వచ్చి, పూజ పూర్తి చేసుకుని తన స్వగృహానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమవుతుండగా, గర్షకుర్తి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై అదుపుతప్పి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్ గుంతలో పడిపోయారు.
ఈ ప్రమాదంలో వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రమాద స్థలంలోనే మృతి చెందినట్లు గంగాధర ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






