వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి

by Sridhar Babu |
వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి
X

దిశ, పెద్దపల్లి : వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

వృద్ధులకు ఐడీ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. అంతకుముందు జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను, వృద్ధులకు చట్టాలపై సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులు తమ అభిప్రాయాలను వివరించారు. అనంతరం వృద్ధులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story