- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలించేందుకు కృషి చేయాలి : డీడబ్ల్యూఓ లక్ష్మీ రాజ్యం
బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలించేందుకు కృషి చేయాలని డీడబ్ల్యూఓ లక్ష్మీ రాజ్యం పేర్కొన్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలించేందుకు కృషి చేయాలని డీడబ్ల్యూఓ లక్ష్మీ రాజ్యం పేర్కొన్నారు. బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు మంగళవారం ఎల్లారెడ్డిపేట అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీడబ్ల్యూఓ లక్ష్మీ రాజం హాజరయ్యారు. టీనేజీ ప్రెగ్నెన్సీ... ప్రేమ పేరుతో మోసాలపై అవగాహన నిర్వహించారు. బాలింతలు గర్భిణీలు తమ అంగన్ వాడీ తీసుకుంటున్న పోషక పదార్థాలపై చర్చించారు. ఈ ప్రోగ్రామ్ తరువాత డీడబ్ల్యూఓ అంగన్ వాడీ సెంటర్లు తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. లబ్దిదారులు టిఫిన్ బాక్స్ రూపంలో ఇంటికి తీసుకెళ్లకుండా అంగన్ వాడీ కేంద్రంలో భోజనాలు స్పాట్ ఫీడింగ్ చేయాలని కోరారు. హబ్ కో ఆర్డినేటర్ రోజా, తహశీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, ఈఓ వనిత, ఐసీటీఎస్ కౌన్సిలర్ భార్గవి, సర్పంచ్ ఎనగందుల నరసింహులు, వార్డు మెంబర్లు అంగన్ వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.






