- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేసవి సెలవుల ఎఫెక్ట్.. వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు
వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

దిశ, వేములవాడ: వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనంలో భాగంగా వేకువజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలచారించారు. తదనంతరం స్వామి వారి దర్శనానికై క్యూలైన్లలో వేచి ఉండి, ముందుగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మగుండం, కళ్యాణ కట్ట, లడ్డు కౌంటర్లు రద్దీగా మారి, ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తుల రద్దీతో పాటు వేసవి కాలం నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.






